సిఎం రేవంత్ రెడ్డి వరుణయాగం చేసి చేతులెత్తేశారని రాష్ట్ర రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రంలో కరువు పరిస్థితి చూస్తుంటే బాధగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరువు మండలాలు ప్రకటించలేదని కవిత విమర్శించారు. కృష్ణా జలాలు కుప్పం వరకు పోయాయని, మన పాలమూరుకు రాని పరిస్థితని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఎపి సిఎం చంద్రబాబుకు నీళ్లను గిఫ్ట్ గా ఇస్తున్నారని, హైదరాబాద్ సహా చాలా పట్టణాల్లో నీటి కొరత ఉందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.