పరిశ్రమల ఏర్పాటుకు ఎవరు ముందుకు వచ్చినా ప్రోత్సహిస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మెదక్ జిల్లాలో తూఫ్రాన్ మండలం బ్రాహ్మణపల్లి వద్ద సాబర్ డెయిరీ ప్రాజెక్టు ప్లాంట్ కు భూమి పూజ చేశారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమపై లక్షలాది రైతులు ఆధారపడి ఉన్నారని పాల ఉత్పత్తిలో అమూల్ సంస్థది గొప్ప విజయప్రస్థానం అని కొనియాడారు. వర్గీస్ కురియన్ తెచ్చిన శ్వేతవిప్లవం పాల ఉత్పత్తిలో గొప్ప మార్పు తెచ్చిందని పేర్కొన్నారు. ఎల్ నినో పరిస్థితుల్లో రైతులు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలని శ్రీధర్ బాబు సూచించారు.