ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ ఆర్థిక రాజధాని ముంబై వీధులు శని, ఆదివారాల్లో హోరెత్తిపోయాయి. నేడు ముంబైలో శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎంఎన్ఎస్ అధినేత రాజ్ ఠాక్రే ఇద్దరూ కలిసి ‘విరాట్ గర్జన మోర్చా’ పేరిట చేపట్టిన ఈ మహా నిరసన ప్రదర్శనకు విపక్షాల నుంచి భారీ స్పందన లభించింది. ఈ మోర్చాలో ఏ రాజకీయ పార్టీ జెండాలకూ అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం.