loader

850 లోక్‌సభ సీట్ల సంఖ్య- కేంద్రంపై రాహుల్ విమర్శలు

జమ్మూకశ్మీర్, అస్సాంలో ఏం జరిగిందో చూద్దాం. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్లను మార్చడం, నియోజకవర్గ రూపురేఖలను మార్చేటం చేశారు. ఒక నియోజకవర్గంలో 26లక్షల మంది, మరో దాంట్లో 19లక్షల మంది ఉండేలా బీజేపీకి అనుకూలంగా ఓటర్లను మార్చారు. ఇక రెండోది నియోజకవర్గాలను ముక్కలు చేయడం. అదానీ, మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ వంటి దొంగలు ఈ దేశాన్ని, మిమ్మల్ని నిరంతరం దోచుకుంటూ, మీ భవిష్యత్తును నాశనం చేయనున్నారు.

‘దేశంలో ప్రస్తుతం నియంత పాలన నడుస్తోంది’- కేంద్రంపై రాహుల్ విమర్శలు

బీజేపీ దేశాన్ని ‘నియంతృత్వం’ వైపు తీసుకెళ్తోందని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపించారు. రాష్ట్రాలకు సమాన వాటా, సీట్ల ఫ్రీజింగ్ అనేది సమస్యే కాదు. 850 అనే సంఖ్య ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంది. నరేంద్ర మోదీ, అమిత్ షా, జ్ఞానేశ్‌కుమార్‌కు ఒక ఖాళీ కాన్వాస్ ఇచ్చి, దేశ నియోజకవర్గాల మ్యాప్‌ను తమకు నచ్చినట్లుగా మళ్లీ గీసుకోవడానికి అవకాశం ఇవ్వడమే ఈ బిల్లు ఉద్దేశం. రాజ్యాంగ సవరణ 850 లోక్‌సభ సీట్ల సంఖ్య దేశ ప్రజాస్వామ్య […]

ఎల్బీనగర్ పరిధిలో రూ.3.20 కోట్ల దోపిడీ

ఎల్బీనగర్ మన్సూరాబాద్ లో రూ.3.20 కోట్ల నగదు దోపిడీ ఘటన కలకలం సృష్టించింది. చండీశ్వరీ కాలనీ రోడ్ నంబర్-2లోని ఓ ఇంట్లోకి చొరబడిన నలుగురు దుండగులు.. మానమ్మ (65) అనే వృద్ధురాలితోపాటు ఆమె కోడలిని నిర్బంధించారు. బీరువాను పగులగొట్టి అందులోని రూ.3.20 కోట్ల నగదు తీసుకొని పరారయ్యారు. బంధువుల పెళ్లికి వెళ్తుండటంతో.. ఈ నెల 22న ఆ నగదును విజయ్ అనే వ్యక్తి ఆ ఇంట్లో భద్రపరిచినట్లు సమాచారం. బైక్ పై వచ్చిన ఐదుగురు వ్యక్తులు దోపిడీకి […]

రష్యాలో 6.7 తీవ్రతతో భూకంపం

రష్యాలో భూకంపం సంభవించింది. కమ్చట్కా ప్రాంతంలో రిక్టర్ స్కేల్‌పై 6.7గా తీవ్రత నమోదైంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.45 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన ఎలాంటి సమాచారం తెలియలేదు. 205 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భారత ఏజెన్సీ అంచనా వేసింది. యూఎస్ జియోలాజికల్ సర్వే మాత్రం దీని లోతు 188 కిలోమీటర్లుగా పేర్కొంది. కమ్చట్కా ద్వీపకల్పంలోని యెలిజోవోకు ఉత్తర వాయువ్యంగా 62 కి.మీ. […]

రెండో విడత పంచాయతీ పోరుకు పటిష్ఠ పోలీసు బందోబస్తు

రాష్ట్రంలో రేపు(ఆదివారం) ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు 3,880 గ్రామపంచాయితీలలో పోలింగ్ ప్రక్రియ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 33 వేల పైచిలుకు పోలీసులు ఎన్నికల విధుల్లో బందోబస్తు నిర్వర్తిస్తున్నారు. మొత్తం పోలింగ్ స్టేషన్ లొకేషన్లు (PSLs): 9,572 హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు: 1,840 (9,048 మంది సిబ్బంది) సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు: 2,043 (8,164 మంది సిబ్బంది),సాధారణ పోలింగ్ కేంద్రాలు: 5,689

ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. కారు లోయలో పడి ఏడుగురి మృతి

ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్‌ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ కారు లోయలో పడి ఏడుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రిఖ్నిఖాల్‌లోని కల్వాడి ప్రాంతంలో ఇవాళ (శనివారం) జరిగింది. భంగల్వాడ్ గ్రామానికి చెందిన 12 మంది దీదీ-భూలీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు రిఖ్నిఖాల్‌కు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి గ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యంలో వారి వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.

కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ర్యాగింగ్.. 38 మంది విద్యార్థులు స‌స్పెండ్‌

ఉత్తరప్రదేశ్‌లోని ప్రఖ్యాత కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ (KGMU)లో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. మొదటి సంవత్సరం ఎంబీబీఎస్ విద్యార్థులు సీనియర్ల ముందు తలవంచి ‘ప్రణామ్ మహోదయ్’ అంటూ నమస్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ విషయం బయటపడింది. దీనిని తీవ్రంగా పరిగణించిన వర్సిటీ యాజమాన్యం 38 మంది విద్యార్థులను మూడు నెలల పాటు సస్పెండ్ చేసింది. ఒక్కొక్కరికి రూ.25,000 చొప్పున జరిమానా విధించడంతో పాటు, ఏడాది పాటు స్కాలర్‌షిప్‌లను నిలిపివేస్తూ కఠిన […]

“ఫ్రెండ్లీ పోలీసింగ్” అంటే నాకు అలర్జీ ! డీజీపీ సీవీ ఆనంద్ ఆసక్తిరక వ్యాఖ్యలు

ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే తనకు నచ్చదని డీజీపీ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి వారికి దగ్గరగా ఉంటూ నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తేనే సమాజంలో గౌరవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మాదక ద్రవ్యాల సమస్య రాష్ట్రంలోనే కాదు, దేశంలో పెద్ద సవాలుగా మారింది. 2029 డిసెంబర్ 31 నాటికి నషా ముక్త్ భారత్గా తయారవుతుందని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే […]

అన్ని పార్టీలు మద్దతు తెలపాలని అమిత్‌ షా పిలుపు

డీలిమిటేషన్ బిల్లు కేవలం చట్టపరమైన సంస్కరణ మాత్రమే కాదని, దేశ నిర్మాణంలో మహిళలకు సముచితస్థానం కల్పించే నిర్ణయాత్మక అడుగు అని బీజేపీ పేర్కొంది. భారతీయ ‘నారీశక్తి’కి ఇచ్చిన హామీని నెరవేర్చే సమయం ఆసన్నమైందని తెలిపింది. రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లను 50శాతం పెంచేందుకు ఉద్దేశించిన 132వ రాజ్యాంగ సవరణ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని అమిత్ షా ఎక్స్ వేదికగా కోరారు. శుక్రవారం కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో దేశంలోని మహిళల దశాబ్దాల నిరీక్షణకు […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON