ఉత్తరాఖండ్‌లోని పౌరీ గర్వాల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తూ కారు లోయలో పడి ఏడుగురు మృతిచెందగా.. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన రిఖ్నిఖాల్‌లోని కల్వాడి ప్రాంతంలో ఇవాళ (శనివారం) జరిగింది. భంగల్వాడ్ గ్రామానికి చెందిన 12 మంది దీదీ-భూలీ పథకం కోసం దరఖాస్తు చేసుకునేందుకు రిఖ్నిఖాల్‌కు వెళ్లారు. పని ముగించుకుని తిరిగి గ్రామానికి బయలుదేరగా.. మార్గమధ్యంలో వారి వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది.