తమిళనాడులోని తిరుప్పరన్ కుండ్రం కొండపైనున్న దీపస్తంభంపై ఎట్టకేలకు కార్తిక దీపం వెలిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పటిష్ఠ భద్రత నడుమ ఆలయ పూజారులు దీపాన్ని వెలిగించారు. కేవలం 50 మంది భక్తులను మాత్రమే అనుమతించారు. అక్కడి దర్గా చుట్టూ 50 మీటర్ల మేర బఫర్ జోన్ ను ఏర్పాటు చేశారు. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ వైద్యనాథన్, జస్టిస్ పార్తిబన్ పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.