ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే తనకు నచ్చదని డీజీపీ సీవీ ఆనంద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంచి వారికి దగ్గరగా ఉంటూ నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తేనే సమాజంలో గౌరవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. డ్రగ్స్ నియంత్రణకు దేశవ్యాప్తంగా ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. మాదక ద్రవ్యాల సమస్య రాష్ట్రంలోనే కాదు, దేశంలో పెద్ద సవాలుగా మారింది. 2029 డిసెంబర్ 31 నాటికి నషా ముక్త్ భారత్‌గా తయారవుతుందని స్పష్టం చేశారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో ఉందని గుర్తుచేశారు.

