జమ్మూకశ్మీర్, అస్సాంలో ఏం జరిగిందో చూద్దాం. ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటర్లను మార్చడం, నియోజకవర్గ రూపురేఖలను మార్చేటం చేశారు. ఒక నియోజకవర్గంలో 26లక్షల మంది, మరో దాంట్లో 19లక్షల మంది ఉండేలా బీజేపీకి అనుకూలంగా ఓటర్లను మార్చారు. ఇక రెండోది నియోజకవర్గాలను ముక్కలు చేయడం. అదానీ, మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ వంటి దొంగలు ఈ దేశాన్ని, మిమ్మల్ని నిరంతరం దోచుకుంటూ, మీ భవిష్యత్తును నాశనం చేయనున్నారు.

