విజయ్ సర్కార్ సంచలనం.. తమిళనాడులో వెలగని దీపం
సుప్రీం కోర్టు, మద్రాస్ హై కోర్టులు ఆదేశించినా మధురైలోని తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించేందుకు నో చెప్పింది. దీంతో దీపం వెలిగించే దీపతూన్ స్తంభంపై కాకుండా కొద్ది దూరంలో ఉన్న ఉచ్చిపిళ్లయార్ ఆలయంలో దీపం వెలిగించారు. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు, హిందూ సంఘాలు కొండ కింద ఉన్న మురుగన్ ఆలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వెంటనే దీపతూన్ స్తంభంపై దీపం వెలిగించాలని డిమాండ్ చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఘర్షణ నెలకొంది.

