గూగుల్ క్లౌడ్ ఇండియా విభాగంలో భారీ ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గూగుల్ సంస్థ తీవ్రంగా ఖండించింది. గూగుల్ ఇండియాలో పనిచేస్తున్న ఉద్యోగులలో దాదాపు సగం మందిపై వేటు పడిందని నెట్టింట పోస్టులు విపరీతంగా వైరల్ అయ్యాయి తమ సంస్థలో భారీ స్థాయిలో లేఆఫ్స్ ప్రక్రియ ఏదీ జరగడం లేదని గూగుల్ స్పష్టం చేసింది. ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్’లో భాగంగా గత వారం కేవలం 30 మంది ఉద్యోగులను మాత్రమే తొలగించినట్లు వెల్లడించింది.