తెల్లవారుజామున దట్టమైన మంచు తెరలు ఏడుకొండలను పూర్తిగా కమ్మేశాయి. శ్రీవారి ఆలయంతో పాటు మాడ వీధులు, పరిసర ప్రాంతాలన్నీ తెల్లని మంచు దుప్పటిలో ఒదిగిపోయాయి. మరోవైపు తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్లపై కూడా పొగమంచు తీవ్రత భారీగా పెరిగింది. మలుపుల వద్ద ఎదురుగా వస్తున్న వాహనాలు సైతం కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్లలో ప్రయాణించే వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పరిమిత వేగంతోనే ప్రయాణించాలని స్పష్టం చేశారు.

