కార్తీక దీపోత్సవం సందర్భంగా తమిళనాడులోని అరుణాచలం భక్తజనసంద్రంగా మారింది. వేలాది మంది శివభక్తులు కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తిశ్రద్ధలతో గిరిప్రదక్షిణ చేస్తున్నారు. హరహర మహాదేవ, ఓం నమః శివాయ నామస్మరణలతో అరుణాచల క్షేత్రం మార్మోగుతోంది. మరోవైపు, సాయంత్రం నిర్వహించనున్న కార్తీక మహాదీపోత్సవాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అరుణాచలానికి తరలివస్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు, గిరిప్రదక్షిణ మార్గాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల రాకతో ఎటుచూసినా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.