తెలంగాణ ఏఐసీసీ ఇన్చార్జి బీఎం సందీప్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి నిన్న అర్ధరాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.పార్టీ నాయకత్వంపై వీరిద్దరూ చేస్తున్న బహిరంగ విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో ఇన్చార్జి సూచనలతో ఏకీభవించిన రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి ఇకపై పార్టీకి నష్టం కలిగించేలా బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని హామీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని, పార్టీలో వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని సందీప్ భరోసా ఇచ్చారు.