loader

రష్యా ఆర్మీలో చిక్కుకున్న విశాఖ యువకులు..

ఉపాధి కోసం రష్యా వెళ్లిన విశాఖ యువకులను ఓ నేపాల్ వ్యక్తి ఆర్మీలో ఫుడ్ ప్యాకేజింగ్ ఉద్యోగాలని చెప్పి ఆర్మీలో చేరిన తర్వాత తమను రష్యా-ఉక్రెయిన్ బార్డర్‌లో యుద్ధంలోకి పంపిస్తున్నారని వారు ఒక సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. రష్యన్ భాషలో ఉన్న పేపర్లపై తమతో సంతకాలు చేయించుకున్నారని పేర్కొన్నారు. తాము యుద్ధభూమిలో ఉన్నామని, ఇదే తమకు చివరిరోజు కావచ్చని చెబుతూ, దయచేసి ప్రధాని మోడీ తమ ప్రాణాలను కాపాడి ఏపీకి వచ్చేలా సహాయం చేయాలని […]

ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం

హైదరాబాద్‌లో పాదయాత్ర వేళ ఎక్స్‌లో అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. ఎన్నికల్లో వరస ఓటములతో కాంగ్రెస్‌ కుదేలైందని విమర్శించారు. ఇప్పుడు అరాచకాలు చేసైనా అధికారంలోకి రావాలని చూస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసైనా, అధికారం దక్కించుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను భగ్నం చేసి, ప్రజాస్వామాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇవాళ హైదరాబాద్‌లో యాత్ర చేస్తున్నామన్న ఆయన, ‘ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం – అరాచకవాదాన్ని అంతం చేద్దాం’ అని ట్వీట్​ చేశారు.

ఒమర్–నిధి..పెళ్లి చెల్లదు!

జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జర్నలిస్ట్ నిధి రజ్దాన్ వివాహంపై మతపరమైన వివాదం తెరపైకి వచ్చింది. వీరి వివాహం ఇస్లామిక్ సూత్రాల ప్రకారం చెల్లదని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యానించారు. ఒమర్ అబ్దుల్లా ముస్లిం అయినప్పటికీ, నిధి రజ్దాన్ ముస్లిం కాకపోవడంతో నిధి రజ్దాన్‌ను వివాహం చేసుకునే ముందు ఆమె ఇస్లాంలోకి మారేలా ఒమర్ అబ్దుల్లా చూసుకోవాల్సిందని రజ్వీ వ్యాఖ్యానించారు. ఈ షరతు నెరవేరలేదని పేర్కొంటూ, […]

రాప్తాడు నిందితుడి.. కుడి కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్న వైద్యులు

రాప్తాడు ఘటనలో పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఉన్మాది హేమంత్ ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అతడి ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్వరి వివరాలు వెల్లడించారు. నిందితుడు హేమంత్ కుడి కాలుకు తీవ్ర గాయం కావడంతో సగం కాలు తొలగించే పరిస్థితి రావొచ్చన్నారు. కుడి కాలుకు రక్త సరఫరా తగ్గిందని తెలిపారు. రక్త ప్రసరణ ఎందుకు తగ్గిందో ఆపరేషన్ థియేటర్లోనే తెలుస్తుందని చెప్పుకొచ్చారు. రక్త సరఫరా లేకుంటే కండరాలు చెడిపోతాయని […]

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు

దిల్లీలో సర్​కు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన నిరసనకు సమాధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్​ షా హైదరాబాద్​లో మహా పాదయాత్ర తలపెట్టారు. అమిత్​ షా బేగంపేట నుంచి నేరుగా పాతబస్తీలోని చార్మినార్​ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌కు బయలుదేరారు. ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో అమిత్‌ షా లంచ్‌ మీటింగ్‌ ఏర్పాటు చేసినట్లు నేతలు చెబుతున్నారు.

ఎమ్మెల్యే కోమటిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తనకు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అవకాశం కల్పించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడేళ్లు గడిచిపోయాయని, అయినప్పటికీ తాను పరిస్థితులను అర్థం చేసుకొని మౌనంగా ఉంటున్నానని పేర్కొన్నారు నిధుల కోసం భట్టి విక్రమార్క వద్దకు వెళ్లి అడగాల్సి రావడంపై అసహనం వ్యక్తం చేస్తూ, ‘మనసు చంపుకొని ఆయన దగ్గరకు వెళ్లా’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు […]

రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా కరెంట్ షాక్- 8 మంది కూలీలు మృతి

రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఝుంఝునూ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కదమ్‌ కుండ్‌ వైపు వెళ్లే రహదారిపై పనులు జరుగుతున్న సమయంలో పైన ఉన్న 11 వేల వోల్టుల సామర్థ్యం కలిగిన హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు కంకరను కలిపే యంత్రం తగిలింది. దీంతో ఒక్కసారిగా అందులోకి కరెంట్‌ ప్రవహించింది. అక్కడున్న వారికి తేరుకునే అవకాశం కూడా లభించలేదు. ఒక్కసారిగా విద్యుత్‌ ప్రవహించడంతో కార్మికులు కుప్పకూలిపోయారు.

హైదరాబాద్‌కు అమిత్ షా.. స్వాగతం పలికిన కిషన్ రెడ్డి…

తెలంగాణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షాకి కేంద్ర కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ చేపట్టనున్న మహాపాదయాత్రలో ఆయన పాల్గొననుండటంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. మరోవైపు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, రామ్ చరణ్‌లు కూడా అమిత్ షాతో సమావేశం కానున్నట్లు సమాచారం.

గ్రోక్ ఏఐ ఖర్చులు భరించలేకపోతున్నా: మస్క్

‘గ్రోక్‌’ (Grok) ఏఐ చాట్‌బాట్‌ను నిర్వహించడానికి తన కంపెనీకి భారీ మొత్తంలో డబ్బు ఖర్చవుతోందని పేర్కొన్నారు. వచ్చే ఆదాయంతో పోలిస్తే.. ఖర్చులే ఎక్కువగా ఉన్నాయన్నారు. AI కంపెనీల మొత్తం అప్పు 2026 మధ్య నాటికి దాదాపు 45 శాతం పెరిగి 578 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.54లక్షల కోట్లు)కు చేరుకున్నట్లు ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా ఉన్నాయి. 2025లో సుమారు 399 బిలియన్ డాలర్లుగా […]

వేటకు వెళ్లి సముద్రంలో చిక్కుకున్న మత్స్యకారులు

‘మురసు’ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు జువ్వలదిన్నె తీరంలో చిక్కుకున్నారు. అలల తాకిడి ఎక్కువగా ఉండటంతో తీరానికి 5 కి.మీ. దూరంలో లంగరు వేసుకుని ఉండిపోయారు. బోటులో ఏడుగురు మత్స్యకారులు చిక్కుకుపోయిన విషయంపై స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వారిని ఒడ్డుకు చేర్చేందుకు స్థానిక మత్స్యకారుల సహకారంతో అధికారులు చర్యలు చేపట్టారు. అనంతరం వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON