రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. ఝుంఝునూ జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. కదమ్ కుండ్ వైపు వెళ్లే రహదారిపై పనులు జరుగుతున్న సమయంలో పైన ఉన్న 11 వేల వోల్టుల సామర్థ్యం కలిగిన హైటెన్షన్ విద్యుత్ తీగలకు కంకరను కలిపే యంత్రం తగిలింది. దీంతో ఒక్కసారిగా అందులోకి కరెంట్ ప్రవహించింది. అక్కడున్న వారికి తేరుకునే అవకాశం కూడా లభించలేదు. ఒక్కసారిగా విద్యుత్ ప్రవహించడంతో కార్మికులు కుప్పకూలిపోయారు.