‘గ్రోక్’ (Grok) ఏఐ చాట్‌బాట్‌ను నిర్వహించడానికి తన కంపెనీకి భారీ మొత్తంలో డబ్బు ఖర్చవుతోందని పేర్కొన్నారు. వచ్చే ఆదాయంతో పోలిస్తే.. ఖర్చులే ఎక్కువగా ఉన్నాయన్నారు. AI కంపెనీల మొత్తం అప్పు 2026 మధ్య నాటికి దాదాపు 45 శాతం పెరిగి 578 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.54లక్షల కోట్లు)కు చేరుకున్నట్లు ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ జాబితాలో ఆల్ఫాబెట్, అమెజాన్, యాపిల్, మెటా, మైక్రోసాఫ్ట్, ఎన్విడియా, టెస్లా ఉన్నాయి. 2025లో సుమారు 399 బిలియన్ డాలర్లుగా ఈ అప్పు ఉంది.