రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా స్పందించారు. బాలిక ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని, ఈ వార్త తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. విద్యార్థిని త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ ఎంతో ఊరటనిచ్చే శుభవార్త అని చెప్పుకొచ్చారు. బాలిక త్వరగా పూర్తిగా కోలుకుని, చిరునవ్వులతో మన ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌లో మంత్రి లోకేశ్ పోస్ట్ చేశారు.

