దిల్లీలో సర్‌కు వ్యతిరేకంగా విపక్షాలు చేపట్టిన నిరసనకు సమాధానంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌లో మహా పాదయాత్ర తలపెట్టారు. అమిత్ షా బేగంపేట నుంచి నేరుగా పాతబస్తీలోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఐటీసీ కాకతీయ హోటల్‌కు బయలుదేరారు. ఐటీసీ కాకతీయలో బీజేపీ నేతలతో అమిత్ షా లంచ్ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు నేతలు చెబుతున్నారు.