జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, జర్నలిస్ట్ నిధి రజ్దాన్ వివాహంపై మతపరమైన వివాదం తెరపైకి వచ్చింది. వీరి వివాహం ఇస్లామిక్ సూత్రాల ప్రకారం చెల్లదని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా ముఫ్తీ షహాబుద్దీన్ రజ్వీ బరేల్వీ వ్యాఖ్యానించారు. ఒమర్ అబ్దుల్లా ముస్లిం అయినప్పటికీ, నిధి రజ్దాన్ ముస్లిం కాకపోవడంతో నిధి రజ్దాన్ను వివాహం చేసుకునే ముందు ఆమె ఇస్లాంలోకి మారేలా ఒమర్ అబ్దుల్లా చూసుకోవాల్సిందని రజ్వీ వ్యాఖ్యానించారు. ఈ షరతు నెరవేరలేదని పేర్కొంటూ, వారి వివాహాన్ని ‘నాజాయిజ్’ (చెల్లనిది)గా అభివర్ణించారు.