మరో తుపాను ముప్పు రాష్ట్రానికి పొంచి ఉన్న నేపథ్యంలో విపత్తుని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఆర్.డబ్ల్యూఎస్ సిబ్బంది సన్నద్ధంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మురసు తుపాను ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో, ఆయా జిల్లాల యంత్రాంగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజల్ని తక్షణం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని

