loader

పాకిస్థాన్‌కు భారత్ ఆహ్వానం..మూడు రోజుల పాటు సదస్సు..

భారత్‌లో మరో కీలక అంతర్జాతీయ సదస్సు జరగనుంది. షాంఘై సహకార సంస్థ (SCO) ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించనున్న ‘నాగరికతల సంభాషణ వేదిక’కు న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సదస్సులో పాల్గొనాలని ఎస్‌సీఓలోని పది సభ్య దేశాలకు ఆహ్వానాలు పంపించారు. ఇందులో పాకిస్థాన్ కూడా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి తమ దేశం తరఫున ఎవరు హాజరవుతారనే విషయాన్ని పాకిస్థాన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. 25కు పైగా దేశాల ప్రతినిధులు సమావేశమయ్యే అవకాశం ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ […]

తుఫాన్ పరిస్థితిపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ!

సీఎం చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించి అర్నబ్ తుఫాన్ ప్రభావిత జిల్లాల పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా నెట్వర్క్ ద్వారా క్షేత్రస్థాయి పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులు తుఫాన్ గమనం, తీరం దాటే దిశ, ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి […]

రాష్ట్రంలో పలువురు IAS​ అధికారుల బదిలీ – కీలక పోస్ట్​ నుంచి జయేశ్ రంజన్​ ఔట్

తెలంగాణలో కీలక బాధ్యతల్లో ఉన్న పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ ఆలోచనలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్​ను మెట్రోపాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్​మెంట్ ప్రత్యేక సీఎస్ బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పించింది. అటవీ, పర్యావరణ శాఖల ప్రత్యేక సీఎస్​గా బదిలీ చేసింది. మెట్రోపాలిటన్ ఏరియా సెక్రటరీతో పాటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజి​గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారిగా హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అదనపు బాధ్యతలు […]

అనకాపల్లిలో 25సెం.మీ వర్షం

అర్నబ్ తుఫాన్ ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత వర్షం నమోదైంది. అనకాపల్లి జిల్లా కన్నూరుపాలెంలో అత్యధికంగా 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. విశాఖపట్నంలో 24 సెంటీమీటర్లు, చీమలపల్లి, తాడి, పరవాడ, అచ్యుతాపురం ప్రాంతాల్లో 23 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సింహాచలంలో 22 సెంటీమీటర్లు, దేశపాత్రునిపాలెంలో 21 సెంటీమీటర్లు, బుచ్చయ్యపేట, కోడూరు, పద్మనాభం, గంధవరం ప్రాంతాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

అర్నబ్ తుపాను బీభత్సం.. వరదలకు కొట్టుకుపోయిన వంతెనలు!

ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నట్లు సమాచారం. అనంతగిరి మండలంలో ఈదురుగాలులు, వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో వంతెనలు దెబ్బతిన్నాయి. దీంతో స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొత్తూరు పంచాయతీ పరిధిలో శివలింగపురం–కృష్ణాపురం మధ్య ఉన్న వంతెనపై నుంచి వరద నీరు పొంగిపొర్లడంతో వంతెన వరద తాకిడికి కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. మండలంలోని కాశీపట్నం వద్ద గోస్తని నది తుపాను ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నట్లు సమాచారం.

స్టాక్ మార్కెట్‌లో జియో ధన్ ధనా ధన్… భారీ ప్రీమియంతో సూపర్ లిస్టింగ్

జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ లిస్టింగ్‌పై ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 28 ఉదయం 10 గంటలకు జియో షేర్లు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. బుధవారం నాడు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. ఊహించినట్టుగానే 20 శాతంపైగా ప్రీమియంతో జియో షేర్లు లిస్ట్ అయ్యాయి. సరిగ్గా ఉదయం 10 గంటలకు 21.36 శాతం ప్రీమియంతో రూ.1358 దగ్గర జియో షేర్లు లిస్ట్ అయ్యాయి. ఈ లిస్టింగ్‌తో మార్కెట్ వ్యాల్యుయేషన్ పరంగా […]

1,976 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం.. మిగిలిన చోట్ల ఎన్నికలు

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 9,829 ఎంపీటీసీ స్థానాల్లో 1,976 స్థానాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. మిగిలిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల సంఖ్యపై స్పష్టత ఏర్పడింది. పలు ప్రాంతాల్లో కూటమి పార్టీలకు చెందిన రెబల్ అభ్యర్థులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు సమాచారం. దీంతో కొన్ని చోట్ల పోటీ లేకుండానే అభ్యర్థులు ఎన్నికయ్యారు.

గంట కొట్టి లిస్టింగ్ ప్రారంభించిన ముఖేష్ అంబానీ ఫ్యామిలీ

రిలయన్స్ ఇండస్ట్రీస్, ముఖేష్ అంబానీ మద్దతుతో రూ. 30,213 కోట్ల రికార్డు స్థాయి ఐపీఓతో జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ దలాల్ స్ట్రీట్‌లో చారిత్రాత్మకంగా అరంగేట్రం చేసింది. బిలియనీర్ ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) మద్దతు ఉన్న ఈ డిజిటల్, టెలికమ్యూనికేషన్స్ దిగ్గజంపై పెట్టుబడిదారులు భారీ ఆసక్తి చూపించారు. ఈ నేపథ్యంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ప్లాట్‌ఫామ్స్ మార్కెట్‌లోకి ప్రవేశించింది. జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ లిస్టింగ్ కార్యక్రమం బుధవారం ప్రారంభం కావడంతో దలాల్ […]

77 జడ్పీటీసీలు, 1,976 ఎంపీటీసీలు ఏకగ్రీవం

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి పలు చోట్ల అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలు ఉండగా, వీటిలో 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) 71 స్థానాలను కైవసం చేసుకోగా, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) మూడు, జనసేన పార్టీ రెండు స్థానాలను దక్కించుకున్నాయి. ఏలూరు జిల్లాలోని పెదవేగి మండలంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కుమార్తె నవ్యశ్రీ ఏకగ్రీవంగా ఎన్నిక […]

అర్నబ్ తుపాను : యానాంలో నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు

అర్నబ్‌ తుపాను కేంద్రపాలిత ప్రాంతం యానాంపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యానాంలో టంగుటూరి ప్రకాశం పంతులు జూనియర్ కళాశాల, మత్స్య శాఖ కార్యాలయాల వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ సిబ్బంది వృక్షాలను తొలగిస్తున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON