అర్నబ్ తుపాను కేంద్రపాలిత ప్రాంతం యానాంపై తీవ్ర ప్రభావం చూపింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. యానాంలో టంగుటూరి ప్రకాశం పంతులు జూనియర్ కళాశాల, మత్స్య శాఖ కార్యాలయాల వద్ద భారీ వృక్షాలు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అగ్నిమాపక శాఖ, పోలీసు, రెవెన్యూ సిబ్బంది వృక్షాలను తొలగిస్తున్నారు. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి.