ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. పూజారి బంటుపల్లి వెంకటరావు సిరిమానును అధిరోహించి భక్తులను ఆశ్వీరదించారు. ఆలయం నుంచి కోట వరకు మూడు సార్లు సిరిమానును తిప్పారు. సిరిమానుకు ముందు అంజలి రథం, తెల్ల ఏనుగు, బెస్తవారి వలను ఏర్పాటు చేశారు. వేలాది మంది భక్తులు అమ్మవారిని తలుచుకుంటూ సిరిమాను వెంట నడిచారు. ఉత్సవాలను తిలకించేందుకు లక్షలాదిమంది భక్తులు తరలివచ్చారు.