YSRCP కి సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. స్థానిక ఎన్నికల్లో నామినేషన్ల గడువును పెంచాలని వేసిన పిటిషన్ కొట్టేసింది. అదే సమయంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సీసీ ఫుటేజీలను భద్రపరచాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. రెండు వారాల తరువాత నామినేషన్లు వేయలేనివారు ఏమైనా అభ్యంతరాలుంటే కోర్టును ఆశ్రయించుకోవచ్చని, విచారణ జరుపుతామని పేర్కొంది. మరికాసేపట్లో గడువు ముగియబోతున్న తరుణంలో ఇప్పుడు నామినేషన్ల గడువు పొడిగింపు ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదని ధర్మసనానికి వివరించింది.