తెలంగాణలో కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో 31 జిల్లాల్లో 365 కరవు ప్రభావిత మండలాలుగా గుర్తించింది. ఇందులో 111 మండలాల్లో తీవ్రమైన, 254 మోస్తరు ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరవు మండలాల్లో సహాయక చర్యలు చేపట్టాలని కలెక్టర్లను సర్కార్ ఆదేశించింది.