సీఎం చంద్రబాబు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (RTGS) కేంద్రాన్ని సందర్శించి అర్నబ్ తుఫాన్ ప్రభావిత జిల్లాల పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా నెట్వర్క్ ద్వారా క్షేత్రస్థాయి పరిణామాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్టీజీఎస్ ఉన్నతాధికారులు తుఫాన్ గమనం, తీరం దాటే దిశ, ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రికి వివరంగా ప్రజెంటేషన్ ఇచ్చారు. పడిపోయిన చెట్లు, విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించి రవాణా వ్యవస్థను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు.