జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ లిస్టింగ్‌పై ఇన్వెస్టర్లలో భారీ ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 28 ఉదయం 10 గంటలకు జియో షేర్లు స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయి. బుధవారం నాడు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయ్యాయి. ఊహించినట్టుగానే 20 శాతంపైగా ప్రీమియంతో జియో షేర్లు లిస్ట్ అయ్యాయి. సరిగ్గా ఉదయం 10 గంటలకు 21.36 శాతం ప్రీమియంతో రూ.1358 దగ్గర జియో షేర్లు లిస్ట్ అయ్యాయి. ఈ లిస్టింగ్‌తో మార్కెట్ వ్యాల్యుయేషన్ పరంగా చూస్తే అతిపెద్ద బిజినెస్ గ్రూప్‌గా రిలయన్స్ అవతరించింది.