loader

వైద్య విద్యలో ఎఐకి పెరుగుతున్న ప్రాధాన్యం: గవర్నర్

వైద్య విద్యలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ఎంతో కీలకమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ అభ్యసనానికి వైద్య విద్యలో ప్రాధాన్యం పెరుగుతోందని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్య, ప్రజారోగ్య సేవల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని, కాలానుగుణంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వైద్య విద్యలోనూ మార్పులు రావాలని గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అభిప్రాయపడ్డారు.

రష్మికకు క్షమాపణలు చెప్పిన జావేద్ అక్తర్!.. అసలేం జరిగిందంటే?

ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ నటి రష్మిక మందన్న విషయంలో తన వ్యాఖ్యను సరిదిద్దుకుంటూ క్షమాపణలు తెలిపారు. రష్మిక హిందీ ఉచ్చారణపై సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలను తప్పుబడుతూ ఆమెకు మద్దతుగా నిలిచిన ఆయన.. ఈ క్రమంలో రష్మికను తమిళ నటిగా పేర్కొన్నారు. అయితే ఆమె కన్నడ నేపథ్యానికి చెందిన నటి అని నెటిజన్లు గుర్తుచేయడంతో తన పొరపాటును అంగీకరించడంతో క్షమాపణలు తెలిపాడు. హీరోయిన్ రష్మిక హిందీ మాట్లాడేటప్పుడు ఉండే యాసను ఎగతాళి చేయడం సరికాదని […]

అర్నబ్ తుఫాన్ ముప్పు.. స్కూళ్లకు సెలవులు!

కాకినాడ జిల్లాకు ‘అర్నబ్’ తుపాన్ ముప్పు పొంచి ఉంది. రేపు రాత్రికి ఇది తీవ్ర తుపాన్‌గా మారి, బాపట్ల – విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 0884-2356801, 9849903879,  అమలాపురం MDO కార్యాలయం: 08856-233208, రామచంద్రపురం MDO కార్యాలయం: 08857-245166

తాడిపత్రి పీఎస్ ఎదుట.. మంచం వేసుకుని నిద్రించిన జేసీ

అనంతపురం జిల్లా తాడిపత్రి తిమ్మంపల్లి గ్రామంలో టీడీపీ నాయకులపై జరిగిన దాడిని నిరసిస్తూ, అందుకు బాధ్యులైన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ నేత, జేసీ ప్రభాకర్ రెడ్డి వినూత్న నిరసనకు దిగారు. తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ బయట రహదారిపైనే మంచం వేసుకుని పడుకుని చేపట్టిన నాటకీయ నిరసన తీవ్ర కలకలం రేపింది. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం పరిసరాల్లో రాళ్లదాడి జరిగినట్లు పరస్పర ఆరోపణల నేపథ్యంలో ప్రాంతంలో ఉద్రిక్త […]

రాహుల్ కాన్వాయ్‌కు ప్రమాదం.. పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై ఘటన

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వే హాలియాపూర్‌లో సోమవారం ఉదయం 10.15 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. కాన్వాయ్ ముందు వైపు కాంగ్రెస్ నేతకు చెందిన ఒక ప్రైవేటు వాహనం వెళుతోంది. ఆ వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకులు వేయడంతో వెనుక కాన్వాయ్‌లో వస్తున్న వాహనాల్లో ఐదు వెహికల్స్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు భద్రతా సిబ్బంది, పార్టీ కార్యకర్తలు గాయపడ్డారని […]

పార్లమెంట్‌ సమీపంలో అగ్నిప్రమాదం

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సమీపంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్న నార్త్ బ్లాక్‌ వెనుక భాగం నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో ఆందోళన వ్యక్తమైంది. సమాచారం నార్త్ బ్లాక్ భవనం నుంచి పొగలు వస్తున్నట్లు సోమవారం ఉదయం 11.10 గంటలకు ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. నార్త్ బ్లాక్ భవనంలో మరమ్మతుల పనులు జరుగుతున్నాయని, వాటి కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ఓ పోలీసు అధికారి పేర్కొన్నట్లు పీటీఐ వార్తా […]

ప్రభుత్వంపై ఆగ్రహం.. ఇజ్రాయెల్ లో భారీ నిరసనలు

ఇజ్రాయెల్ ఎన్నికలకు ముందు ఇజ్రాయెల్ లోని టెల్ అవీవ్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్టోబర్ 7, 2023న హమాస్ జరిపిన దాడిలో భద్రతా వైఫల్యాలపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ‘హోస్టేజెస్ స్క్వేర్’ వద్ద వేలాది మంది ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఏపీలో ఎన్నికల రచ్చ.. 50,815 నామినేషన్లు ఓకే..

ఈ సారి పరిషత్ పోరులో ప్రధాన పార్టీలన్నీ తమ సత్తా చాటేందుకు రెడీ అయిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లు ఓకే అయ్యాయి. జెడ్పీటీసీ స్థానాల నామినేషన్ల వివరాలు: తెలుగుదేశం పార్టీ: 1,693 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: 1,445 జనసేన పార్టీ: 587 కాంగ్రెస్ పార్టీ: 316 భారతీయ జనతా పార్టీ: 227

ఏపీలో ఎన్నికల రచ్చ.. 50,815 నామినేషన్లు ఓకే..

ఈ సారి పరిషత్ పోరులో ప్రధాన పార్టీలన్నీ తమ సత్తా చాటేందుకు రెడీ అయిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 9,829 ఎంపీటీసీ స్థానాలకు గాను 46,045 నామినేషన్లు చెల్లుబాటు కాగా.. 659 జెడ్పీటీసీ స్థానాలకు 4,770 నామినేషన్లు ఓకే అయ్యాయి. ఎంపీటీసీ : తెలుగుదేశం పార్టీ: 19,760 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ: 17,726 జనసేన పార్టీ: 4,330 భారతీయ జనతా పార్టీ: 1,049

తెదేపాలో చేరిన చిలకలూరిపేట వైకాపా ఛైర్ పర్సన్ అభ్యర్థిని

పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురపాలక వైకాపా ఛైర్ పర్సన్ అభ్యర్థి కరీమూన్ షేక్ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెదేపాలో చేరారు. వైకాపాకు రాజీనామా చేసి ఈ పార్టీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు. అభ్యర్థుల తుది జాబితాలో కూటమి తరపున జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరి, వైకాపా నుంచి కరీమూన్ షేక్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇక తాము కూటమి తరపున ప్రచారంలో పాల్గొంటామన్నారు. ఆమెతో పాటు భర్త యూసఫ్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON