వైద్య విద్యలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ఎంతో కీలకమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ అభ్యసనానికి వైద్య విద్యలో ప్రాధాన్యం పెరుగుతోందని అన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైద్య విద్య, ప్రజారోగ్య సేవల్లో ప్రత్యేక గుర్తింపు పొందిందని, కాలానుగుణంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వైద్య విద్యలోనూ మార్పులు రావాలని గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్ అభిప్రాయపడ్డారు.

