పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురపాలక వైకాపా ఛైర్ పర్సన్ అభ్యర్థి కరీమూన్ షేక్ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో తెదేపాలో చేరారు. వైకాపాకు రాజీనామా చేసి ఈ పార్టీలో చేరుతున్నట్లు ఆమె ప్రకటించారు. అభ్యర్థుల తుది జాబితాలో కూటమి తరపున జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరి, వైకాపా నుంచి కరీమూన్ షేక్ ప్రధాన పోటీదారులుగా ఉన్నారు. ఇక తాము కూటమి తరపున ప్రచారంలో పాల్గొంటామన్నారు. ఆమెతో పాటు భర్త యూసఫ్ అలీ కూడా తెదేపాలో చేరారు.