శ్రీశైలం మల్లన్న ఆలయం నవంబరు నెలకు సంబంధించి దర్శనం, సేవల టికెట్లు ఆన్లైన్లో విడుదలయ్యాయి. ప్రధానంగా స్వామివారి స్పర్శ దర్శనం, శీఘ్ర, అతిశీఘ్ర దర్శనాలతో పాటు 14 రకాలైన ఆర్జిత సేవలకు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. భక్తులు https://www.tms.ap.gov.in వెబ్సైట్, మనమిత్ర వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా బుక్ చేసుకోవచ్చు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ దృష్ట్యా కొన్ని సేవలు, అభిషేకాలను తాత్కాలికంగా నిలిపివేశారు.