వాల్మీకి సంస్కృత సాహిత్యంలో పేరెన్నికగల కవి. రామాయణాన్ని వ్రాశాడు. ఈయన్ని సంస్కృతభాషకు ఆదికవిగా గుర్తిస్తారు. వాల్మీకి శ్లోకమనే ప్రక్రియను కనుగొన్నాడు. ప్రచేతసుని పుత్రుడు కాబట్టి అతడు ప్రాచేతసుడు అని కూడా ప్రసిద్ధం వల్మీకము (పుట్ట) నుండి వెలుపలికి వచ్చిన వారు కావున వాల్మీకి. రామరామ అని తపస్సుచేసిన వారు కావున మహర్షి, రాముడి జీవితచరిత్రను రామాయణముగా మహాకావ్యరచన గావించినవాడిగా ఆదికవి అయ్యాడు.