మున్సిపల్ ఎన్నికల వేళ మంత్రి పొంగూరు నారాయణ పేరుతో ఓ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెల్లూరులోని 6వ డివిజన్లో జనసేన అభ్యర్థిని ఓడించాలని, ఆ అభ్యర్థికి డిపాజిట్లు కూడా దక్కకూడదని మంత్రి ఆదేశించినట్లు ఆ ఆడియోలో ఉంది. అయితే ఈ ఆడియో నిజమైనదా? అందులోని గొంతు మంత్రి నారాయణదేనా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. జనసేన పార్టీకి అభ్యర్థి లేని 7వ డివిజను టీడీపీ కేటాయించిందనే, జనసేన 6వ డివిజన్లో అభ్యర్థిని బరిలోకి దించినట్లు సమాచారం.