loader

మన్‌కీ బాత్ ఓ పవిత్ర యాత్ర: ప్రధాని మోదీ

పన్నెండేళ్ల క్రితం విజయదశమి నాడు మొదలుపెట్టిన ‘మన్‌కీబాత్‌’ ప్రజల సహకారంతో అప్రతిహతంగా కొనసాగుతోందని ప్రధాని మోదీ అన్నారు. 139వ మన్‌కీబాత్ ఎపిసోడ్‌లో ఆయన ప్రసంగించారు. పంజాబ్ సంప్రదాయ వ్యవసాయం, ఉత్తరాఖండ్ మహిళల సాధికారత వంటి అంశాలను ఆయన ప్రస్తావించారు. ఉత్తరాఖండ్ గఢ్‌వాల్ ప్రాంతంలో ప్రజలు హెవల్ నదికి స్థానిక యంత్రాంగం, గ్రామస్థులు వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు చర్యలు తీసుకొన్నారు. భారీ సంఖ్యలో మొక్కలను నాటారు. ఈ చర్యల ఫలితంగా నేడు నది తిరిగి కళకళలాడుతోంది’’ అని ప్రధాని మోదీ […]

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటు నమోదుకు ముందుకు రాని యువత!

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఓటు నమోదు (ఫారం-18) కోసం గ్రాడ్యుయేట్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ ఓటరు నమోదు ప్రక్రియ ప్రారంభించి దాదాపు నెల రోజులు కావొస్తున్నా శనివారం వరకు రెండు స్థానాలకు కలిపి 5,23,758 అప్లికేషన్లు మాత్రమే వచ్చాయి. మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పరిధిలో 2,29,937, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పరిధిలో 2,93,821 మంది మాత్రమే దరఖాస్తు చేశారు. రెండు నియోజకవర్గాల్లో 10 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు.

రామంతపూర్‌లో భారీ పేలుడు కలకలం!

రామంతపూర్‌లోని చర్చ్ కాలనీలో స్క్రాప్ దుకాణంలో జరిగిన పేలుడు తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో దుకాణ యజమాని పరశురాం (43) తీవ్రంగా గాయపడ్డారు. అకస్మాత్తుగా పేలుడు సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. షట్టర్ లో నిర్వహిస్తున్న స్క్రాప్ దుకాణంలో నిల్వ ఉంచిన స్క్రాప్‌లో ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా? లేక ఇతర కారణాలతో ప్రమాదం జరిగిందా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.

‘ఓటును, దేశాన్ని కాపాడుకుందాం’- నవంబర్ 1న భారీ ర్యాలీకి రాహుల్ గాంధీ పిలుపు

ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, ఓట్ల చోరీ ఆరోపణలపై నిరసనగా నవంబర్‌ 1న దిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రకటించారు. ‘సేవ్‌ ది ఓట్‌ సేవ్‌ ది కంట్రీ’ పేరుతో జన మార్చ్‌, భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఓటును, దేశాన్ని కాపాడుకుందాం. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు పౌరులు ఉద్యమంలో భాగస్వాములు కావాలి. ఓటు మీది. పోరాటమూ మీదే’ అంటూ రాంలీలా మైదాన్​, దిల్లీ అని పోస్ట్​లో రాసుకొచ్చారు.

‘రామాయణ’ నుంచి మరో పాట వచ్చేసింది..

రణ్ బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రామాయణ’. నితేశ్ తివారీ దర్శకుడు. రెండు భాగాలుగా రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం మూవీ నుంచి ‘రంగులు రంగులే’ అనే పాటను విడుదల చేసింది. ఇందులో రాముడిగా రణ్వీర్ కపూర్, సీతగా సాయి పల్లవి ఆకట్టుకుంటున్నారు.

యూరప్​ వ్యాప్తంగా భారీ ఆందోళనలు- ఫ్రాన్స్‌లో రోడ్డెక్కిన 4 లక్షల మంది

పెరుగుతున్న జీవన వ్యయం, విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలకు వ్యతిరేకంగా ఫ్రాన్స్‌ సహా యూరప్​లోని పలు దేశాల్లో నిరసనలు తీవ్ర రూపం దాల్చాయి. ఫ్రాన్స్​లో ఒక్కసారిగా ఏకంగా 4.10 లక్షల మంది రోడ్డెక్కగా నిజానికి ఆ సంఖ్య 8 లక్షలు దాటి ఉందని సీజీటీ యూనియన్ అంచనా వేసింది. పారిస్‌ సహా స్ట్రాస్‌బర్గ్, రెన్నెస్ తదితర నగరాల్లో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య భారీ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు పోలీసులపైకి రాళ్లు, ఇతర వస్తువులను విసిరారు. శాంతియుతంగా ప్రారంభమైన […]

2029 నాటికి డ్రగ్స్ నెట్‌వర్క్ నిర్మూలన: అమిత్‌షా

ఆపరేషన్ ట్రైడెంట్‌’ పేరుతో డ్రగ్స్ నియంత్రణపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పోస్టు చేశారు. అక్టోబర్ 23న అసోం, మిజోరం, మణిపూర్‌లోని 38 ప్రాంతాల్లో జరిగిన దాడులను వివరించారు. 18 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ నార్కో-కార్టెల్‌ను నాశనం చేశామని వెల్లడించారు. ఈ క్రమంలో రూ.100 కోట్ల విలువైన హవాలా లావాదేవీలు బయటపడ్డాయని.. 1,424 బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసినట్లు తెలిపారు. 2029 డిసెంబర్ 31 నాటికి మాదకద్రవ్యాల ముఠాలను నిర్మూలించాలని పేర్కొన్నారు.

సౌదీ అరేబియాపై హూతీల పంజా- చమురు కేంద్రాలు, విమానాశ్రయాలే లక్ష్యంగా దాడులు

సౌదీ అరేబియా బలగాలు, యెమెన్‌లోని హూతీ తిరుగుబాటుదారుల మధ్య దాడులు తీవ్రరూపం దాల్చాయి. శనివారం సౌదీ అరేబియా వ్యాప్తంగా ఉన్న కీలక చమురు కేంద్రాలు అరామ్‌కో కేంద్రం, రాబిగ్ రిఫైనరీ, రియాద్‌లోని కింగ్ ఖలీద్, దమ్మామ్‌లోని కింగ్ ఫహద్, నజ్రాన్ అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఖమీస్ ముషైత్‌ ఎయిర్‌బేస్‌పై దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించారు. పవిత్రమైన మక్కా, మదీనా ప్రాంతాల వైపు హూతీలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా, సౌదీ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. కూల్చేసిన క్షిపణుల శకలాలు […]

తెలంగాణకు పొంచి తుఫాను ముప్పు.. 28న ఆ 3 జిల్లాలకు అత్యంత భారీ వర్ష సూచన..

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం రాబోయే రోజుల్లో క్రమంగా బలపడి తుపానుగా మారనుందని వాతావరణ శాఖ అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. అక్టోబర్ 28న తెలంగాణలోని మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు లేదా కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఉత్తర, తూర్పు మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోనూ భారీ వర్ష ప్రభావం కనిపించనుంది.

TG ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన సేవలు

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక సింగిల్ విండో ఆమోద పోర్టల్ ‘టీజీ-ఐపాస్’ రాన్సమ్‌వేర్ సైబర్ దాడికి గురైంది. దీనితో వ్యవస్థ స్తంభించిపోగా, నివేదికలు డాటాబేస్ ఎన్‌క్రిప్ట్ (లాక్) అయినట్లు చూపిస్తున్నాయి. పోర్టల్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసిన సైబర్ నేరగాళ్లు… దాని డేటాబేస్‌ను కూడా ఎన్‌క్రిప్ట్‌ చేశారు. అక్టోబరు 22న రాత్రి 11.36 గంటలకు సైబర్ దాడి జరగడంతో పోర్టల్‌ అప్లికేషన్‌ నిలిచిపోయింది. హ్యాకర్లు నేరుగా డబ్బులు ఏవీ డిమాండ్ చేయలేదు, కేవలం సంప్రదించడానికి ఒక ఈ-మెయిల్ ఐడీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON