ఏపీ స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీ బోణి కొట్టింది. దర్శి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. ఇక్కడ 28 వార్డుల్లో కూటమి అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసిన దారం సుబ్బారావు విజయం సాధించారు. ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించడం లాంఛనమే కానుంది. కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 మున్సిపాలిటీలు, శ్రీకాకుళం, కాకినాడ, ఏలూరు, విజయవాడ కార్పొరేషన్లలో పోటీ చేస్తోంది.