సినీ పరిశ్రమలో ప్రస్తుతం 500 సినిమాల డేటా లీక్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతి సినిమా థియేటర్లలో విడుదల కావాలంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి. సినిమాల సర్టిఫికేషన్ ప్రక్రియ సులభతరంగా మారడానికి పదేళ్ల క్రితం ఇ- నీప్రమాణ్ పోర్టల్ ప్రారంభమైంది. నిర్మాతలు సర్టిఫికేట్ కోసము దరఖాస్తు చేసే వేళ తమ చిత్రాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు పోర్టల్ లో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు సరిగ్గా ఈ ఆన్ లైన్ వేదిక రికార్డులే ఇంటర్నెట్ లో ప్రత్యక్షమై కలకలం రేపాయి.