పేద ప్రజలకు చెందాల్సిన బియ్యాన్ని పక్క దారి పట్టిస్తూ.. ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగిస్తున్న అక్రమ రైస్ మిల్లర్లపై తెలంగాణ సీఐడీ దాడులు చేపట్టింది. హైదరాబాద్, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి జిల్లాల్లో 16 మంది రైస్ మిల్లర్లను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టింది. సన్న బియ్యం బదులు దొడ్డు బియ్యం సరఫరా చేస్తున్న కరీంనగర్, ములుగు, మెదక్ జిల్లాల్లోని మిల్లర్లపై కేసులు నమోదు చేసింది. మిల్లర్లు చేసిన అక్రమాల కారణంగా రాష్ట్ర ఖజానాకు రూ.96 కోట్ల నష్టం వాటిల్లిందని గుర్తించారు.