భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఫ్రెంచ్ ఓపెన్ 2026లో నిరాశ ఎదురైంది. మహిళల సింగిల్స్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నంబర్‌వన్ అన్ సెయంగ్ చేతిలో ఆమె ఓటమి పాలైంది. తొలి గేమ్‌ను గెలిచి టైటిల్‌పై ఆశలు రేకెత్తించిన సింధు.. ఆ తర్వాతి రెండు గేముల్లో తడబాటుకు గురైంది. ప్రత్యర్థి ఆధిపత్యాన్ని అడ్డుకోలేక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటివరకు అన్ సెయాంగ్‌తో 11 సార్లు తలపడిన సింధు.. ఒక్కసారి కూడా గెలవలేకపోవడం గమనార్హం