బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులకు ముందు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ అసలు టార్గెట్ అమిర్‌ఖాన్ అని పోలీసువర్గాలు వెల్లడించినట్లు జాతీయ మీడియా పేర్కొంది. హరియాణా నుంచి ముంబయి వచ్చిన ఇద్దరు షూటర్లు నెల రోజుల్లో అమిర్‌ఖాన్ ఇంటిని మూడుసార్లు పరిశీలించినట్లు అయితే, ఆయన షూటింగ్ నుంచి వచ్చి ఇంట్లోకి వెళ్లాక రోజుల తరబడి బయటకు రాకపోవడంతో నిందితులు టైగర్ ష్రాఫ్ ఆదివారాల్లో ఫుట్‌బాల్ ఆడేందుకు తరచూ వస్తుండటం లక్ష్యంగా చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.