ఇరాన్‌పై తక్షణ సైనిక దాడులు చేసే అవకాశాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా తోసిపుచ్చారు. ఇరాన్‌పై ప్రస్తుతానికి ఎలాంటి దాడులు జరపబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ సమస్యను ఒప్పందం ద్వారా ముగించాలా లేదా ఇరాన్‌పై మిలిటరీ చర్య ద్వారా ‘పని పూర్తి చేయాలా’ అనేది ఆలోచిస్తున్నానని ఆయన చెప్పారు. ట్రంప్ తాజా ప్రకటనలతో తక్షణ దాడి ముప్పు తప్పినప్పటికీ, భవిష్యత్తులో మిలిటరీ దాడి లేదా రాయబార చర్చలు జరిగే అవకాశాలు రెండూ సజీవంగానే ఉన్నాయి.