దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ సమీపంలో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలున్న నార్త్ బ్లాక్ వెనుక భాగం నుంచి దట్టమైన పొగలు వెలువడటంతో ఆందోళన వ్యక్తమైంది. సమాచారం నార్త్ బ్లాక్ భవనం నుంచి పొగలు వస్తున్నట్లు సోమవారం ఉదయం 11.10 గంటలకు ఢిల్లీ అగ్నిమాపక శాఖకు సమాచారం అందింది. నార్త్ బ్లాక్ భవనంలో మరమ్మతుల పనులు జరుగుతున్నాయని, వాటి కారణంగా స్వల్పంగా మంటలు చెలరేగి ఉండవచ్చని ఓ పోలీసు అధికారి పేర్కొన్నట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.