తెలుగు రాష్ట్రాల్లో 15 చోట్ల ఈడీ మెరుపు దాడులు..
తెలుగు రాష్ట్రాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మరోసారి మెరుపు దాడులు చేశారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద నమోదైన కేసుకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో హైదరాబాద్, విజయవాడ సహా ఇరు రాష్ట్రాల్లోని మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, మోసపూరిత ఇన్వెస్టిమెంట్ యాప్‌ల ద్వారా సామాన్యులను ఆకర్షించి వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టిన అంతర్రాష్ట్ర ముఠాలను లక్ష్యంగా చేసుకుని ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

