పారా ఆసియా క్రీడల్లో భారత్ ‘శతకం’ కొట్టింది. ఇవాళ స్వర్ణాలతోపాటు రికార్డులు సృష్టిస్తూ భారత అథ్లెట్లు పతకాల వేట మొదలు పెట్టారు. ప్రస్తుతం 103 పతకాలతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇందులో 27 పసిడి, 33 రజత, 43 కాంస్యాలు ఉన్నాయి. కేవలం అథ్లెటిక్స్‌లోనే సగానికిపైగా పతకాలు సాధించడం విశేషం. టీ64 పురుషుల 400 మీ. పరుగు పందెంలో సందీప్ స్వర్ణం సాధించాడు. కేవలం 52.28 సెకన్లలో రేసును పూర్తి చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు.