అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తీవ్రంగా మండిపోతున్నాయి. పశ్చిమాసియా (మిడిల్ ఈస్ట్)లో మళ్లీ మొదలైన తీవ్ర ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. తాజా ట్రేడింగ్లో బ్రెంట్ క్రూడ్ (Brent Crude) బ్యారెల్ ధర ఒక్క సెషన్లోనే ఏకంగా 4 డాలర్లు (3.68 శాతం) పెరిగి 112.77 డాలర్ల మార్కుకు చేరుకుంది. అదేవిధంగా, అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ (WTI) క్రూడ్ కూడా 2 శాతం ఎగబాకి బ్యారెల్ $99 వద్ద ట్రేడవుతోంది.