తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పరిధిలోని కురవపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సింగిల్ విండో చైర్మన్ ముట్టమ్ ప్రభాకర్‌కు చెందిన కారుకు గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి వేళ నిప్పు పెట్టారు. సీసీ కెమెరాలను పక్కకు తిప్పి మరీ, 4 పెట్రోల్ క్యాన్లతో వచ్చి అత్యంత పగడ్బందీగా కారుకు నిప్పు పెట్టి దగ్ధం చేసినట్లు సమాచారం చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీకి ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రత్యర్థులు ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.