సీట్లు ఇవ్వకుంటే పవన్ కటౌట్తో పోటీ చేస్తాం..
విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకత్వం చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టిస్తోంది. కూటమి సీట్ల సర్దుబాటులో ఒకటి, రెండు సీట్లు మాత్రమే కేటాయిస్తే అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. పార్టీ అధిష్టానం ‘బీ-ఫారం’ ఇస్తే అధికారికంగా గ్లాసు గుర్తుపై పోటీ చేస్తామని జనసేన ఇన్ఛార్జ్ సందీప్ పంచకర్ల తెలిపారు. లేదంటే పవన్ కళ్యాణ్ కటౌట్ పెట్టుకుని ఇండిపెండెంట్లుగానైనా సరే బరిలో నిలుస్తామని ఆయన బహిరంగంగానే ప్రకటించేశారు.

