సిజెపి వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకి ఊరట లభించింది. అతడికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం ఢిల్లీలో తిరంగా మార్చ్ కోసం కనాట్ప్లేస్కు బయలుదేరిన అభిజీత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో ఇచ్చిన శాంతి హామీని ఉల్లంఘించారని ఆరోపిస్తూ శనివారం ఉదయం అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశపెట్టగా.. విచారించిన న్యాయస్థానం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో పీస్ బాండ్పై సంతకం చేయాలని ఆదేశించినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.