నామినేషన్ల ప్రక్రియ మొదలైన రోజు నుండే రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. శనివారం రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి హరినాథ్ రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. రాజంపేట వైసీపీ ఆఫీసుతో పాటు ఎమ్మెల్యే ఇంటిపై దాడి చేసి కిటికీ అద్దాలు, ఫర్నిచర్, కారు ధ్వంసం చేశారు టీడీపీ శ్రేణులు. ఇంత విధ్వంసం జరుగుతున్నా పోలీసులు వేడుక చూస్తూ ఉరుకున్నారని మండిపడుతున్నారు మండిపడుతున్నారు వైసీపీ శ్రేణులు. ఓటమి భయంతోనే కూటమి ప్రభుత్వం తమపై దాడులు చేయిస్తుందని అంటున్నారు వైసీపీ నేతలు.