ఆంధ్రప్రదేశ్లో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యములో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు పార్టీ కీలక నేతలతో నిర్వహించిన సుదీర్ఘ టెలీకాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షం అనుసరిస్తున్న వ్యూహాలు, అక్రమ చర్యలపై నిరంతరం దృష్టి సారించాలని, ఎప్పటికప్పుడు స్థానిక అధికారులను అప్రమత్తం చేస్తూ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా చూడాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు.

