loader

ప్రశ్నించినందుకు కాల్చేశాడు.. డ్రగ్స్ వ్యతిరేక ఉద్యమ కార్యకర్త దారుణ హత్య

పంజాబ్ లోని మాన్సా ప్రాంతంలో ఫోర్స్’ అనే సంస్థ ద్వారా డ్రగ్స్ మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రముఖ కార్యకర్త పర్వీందర్ సింగ్ ఝెటా మంగళవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యారు. ఈ క్రమం లోనే నిషేధిత ఔషధాలు, డ్రగ్స్ విక్రయిస్తున్నారన్న ఆరోపణలతో ఓ మెడికల్ స్టోర్ యజమానితో ఆయనకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ వివాదం ముదరడంతో సదరు కెమిస్ట్‌షాపు యజమాని అతి సమీపం నుంచి పర్విందర్ సింగ్‌పై కాల్పులు జరపడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఊహాగానాల నడుమ కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తమిళనాడులో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తనను పూర్తిగా రాష్ట్ర రాజకీయాలకే పరిమితం చేయాలని ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. తమిళనాడులో బీజేపీ జెండాను ఎగరవేయడానికి, పార్టీని గ్రామస్థాయిలో ప్రజలకు చేరువ చేయడానికి రాష్ట్ర బాధ్యతలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం

కనకదుర్గమ్మను దర్శించుకున్న సీఎంవిజయ్

ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దర్శించుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం విజయ్.. నేరుగా దుర్గమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనం అనంతరం పండితులు వేదాశీర్వచనం చేసి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు. అక్కడి నుంచి సీఎం చంద్రబాబును కలిసేందుకు విజయ్ బయల్దేరి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రికి విజయవాడ ఉత్సవ్లో పాల్గొననున్నారు

UPI పేమెంట్స్‌పై ఛార్జీలు దీపావళి వరకూ వాయిదా

UPI ఛార్జీల విషయంపై ఆందోళన చెందుతున్న వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట అందించింది. దసరా, దీపావళి పండుగ సీజన్ ముగిసే వరకు యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమలును వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. గతంలో ప్రకటించిన విధంగా అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ కొత్త యూపీఐ ఛార్జీల విధానం.. ఇప్పుడు దీపావళి ముగిసిన వెంటనే ప్రకటించబడే కొత్త తేదీ నుంచి అమలవుతుంది.

పబ్‌లో అర్థరాత్రి ఏపీ ఐఏఎస్ రచ్చ.. కుప్పం స్పెషల్ ఆఫీసర్ పై కేసు

కావోర్ బార్ అండ్ రెస్టారెంట్’కు చేరుకుని కస్టమర్ల ఐడెంటిటీ కార్డులు పరిశీలిస్తుండగా పోలీసుల విధుల నిర్వహణను అడ్డుకోవడమే కాకుండా, వారిపై అసభ్య పదజాలంతో విరుచుకుపడిన ఘటనలో ఏపీకి చెందిన 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, కుప్పం ప్రాంతాభివృద్ధి సంస్థ (KADA) ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్‌ను ప్రధాన నిందితుడిగా చేర్చుతూ బెంగళూరు కబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.

గెజిట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత.. ఎన్నికల షెడ్యూల్: అనిల్ చంద్ర పునేఠా

ఏపీలో స్థానిక ఎన్నికలపై రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా వెల్లడించారు. పోటీచేసే అభ్యర్థులకు భద్రత ఇవ్వాలని రాజకీయ పక్షాలు కోరాయని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సంబంధిత విభాగాల నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావాల్సి ఉందని, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు.

“మోడీ ఇంత చేస్తున్నారంటే.. జ్ఞానేష్ ఇంకెంత?”-యూట్యూబర్ ధృవ్ రాఠీ ప్రశ్న..!

సీఈసీ జ్ఞానేష్ కుమార్ కోసం ప్రధాని మోడీ ఇంత చేస్తున్నారంటే .. ప్రధాని కోసం ఆయన ఎంత చేసి ఉంటారన్న ప్రశ్నను యూట్యూబర్ ధృవ్ రాఠీ సంధించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ధృవ్ రాఠీ.. జ్ఞానేష్‌ను కాపాడటానికి మోదీ ఏమేమి చేస్తున్నారో చూడండి.. మోదీని కాపాడటానికి జ్ఞానేష్ ఏమేమి చేశారోఇది మీకు స్పష్టంగా తెలియజేస్తుందంటూ వ్యాఖ్యానించారు. తద్వారా మోడీ తనకు చేసిన సాయానికి జ్ఞానేష్ రుణం తీర్చుకుంటున్నారనే అర్దం వచ్చేలా […]

పనామాలో మరోసారి భూప్రకంపనలు.. 6.0 తీవ్రత

లాటిన్ అమెరికా దేశమైన పనామాలో సోమవారం మళ్లీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.0గా నమోదైనట్లు యూరోపియన్‌-మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌ (EMSC) వెల్లడించింది. తెలిపారు. కొద్ది రోజుల క్రితం (శుక్రవారం) పనామాలో 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ఆ పెను ప్రమాదం కారణంగా సుమారు 900 భవనాలు నేలకూలగా, 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత ఇప్పటివరకు దాదాపు 300కు పైగా ప్రకంపనలు (ఆఫ్టర్‌షాక్స్) నమోదయ్యాయి.

మధ్యంతర ఎన్నికలకు మస్క్‌ భారీ విరాళం

అమెరికాలో నవంబర్‌ మూడో తేదీన జరగాల్సిన మధ్యంతర ఎన్నికలకు గాను అధ్యక్షుడు ట్రంప్‌ సారథ్యంలోని అధికార రిపబ్లికన్‌ పార్టీకి స్పేస్‌ ఎక్స్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ అత్యధికంగా విరాళాలను అందజేసినట్లు వెల్లడైంది. ఆయన ఏకంగా 276 మిలియన్‌ డాలర్లు అంటే, రూ. 2,638 కోట్లు విరాళంగా సమకూర్చారు. డెమోక్రాటిక్‌ పార్టీ నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న రాష్ట్రాల్లో రిపబ్లికన్‌ పార్టీకి దన్నుగా ఉండేందుకు జూలై నుంచి ఈ మొత్తాన్ని అందజేస్తూ వచ్చారని న్యూయార్క్‌ టైమ్స్‌ తన కథనంలో వెల్లడించింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON